RC16: గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి.
ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేకర్స్. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కర్ణాటకలో షూటింగ్ ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. దర్శకుడు బుచ్చిబాబు సనా ‘ఆర్‌సీ16’లో మున్నా భయ్యా నటించబోతున్నాడు అంటూ ప్రకటించాడు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్య పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్‌సీ16’ సినిమాకు అతడు ప్లస్ అవుతాడని చిత్రబృందం భావించినట్లు ఉంది. మరోవైపు ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ నటించనుండగా.. రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.