ఇండస్ట్రీలో అభిమానులు లేకపోతే హీరోలు ఉండరు. అయితే ఆ అభిమానం పిచ్చిగా మారి ఒక్కొక్కసారి ఆ హీరోలకి ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లని అభిమానులు అనేకంటే భక్తులు అనటం న్యాయం. అయితే ఆ భక్తుల వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు అనటంలో సందేహం లేదు.
అది అభిమానుల కి అభిమానమే కానీ పవన్ కళ్యాణ్ కి అది సంకటంగా మారింది. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా ఓజి మూవీ అప్డేట్స్ గురించి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ అభిమాన దేవుడు మాత్రమే కాదు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయం కూడా మరిచిపోయి ఓజి అప్డేట్స్ గురించి అటు నిర్మాతలని ఇటు పవన్ కళ్యాణ్ ని విసిగిస్తూ ఉంటారు ఫ్యాన్స్. పవన్ ఎక్కడ కనిపించినా ఓ జి అంటూ అరుపులు, కేకలు వేస్తూ ఉంటారు.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైరైన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
ముందు రాజకీయాల్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అవి చేసిన తర్వాత ఓజి చూద్దురుగాని అని సర్ది చెప్పినా అభిమానులు చెవికెక్కించుకోవడం లేదు. మరోవైపు ఓ జి అప్డేట్లు ఇవ్వండి అంటూ డివివి ట్విట్టర్ హ్యాండిల్స్ కి రిక్వెస్ట్ లు కూడా పెడుతూ ఉంటారు. డివివి ట్విట్టర్ హ్యాండిల్ వేసే కౌంటర్లు ఇచ్చే పంచులు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఓ జి అప్డేట్స్ అడిగిన ఫ్యాన్స్ కి డివివి ఇచ్చిన రిప్లై ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
మీరేంట్రా వారానికి ఒకసారి ఇలా తగులుకున్నారు, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా మీద పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, సీజ్ ది షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని డివివి తన కౌంటర్లో వాడుకోవటంతో మా మీద కౌంటర్లు వేస్తున్నారు ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే దీనికి మళ్లీ అప్డేట్లు ఉన్నప్పుడు ఇస్తాను లేరా ఇప్పుడు మాత్రం సీజ్ ద షిప్ అని సెటైర్ వేశారు డి వి వి. ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.