ధనుష్ నిర్మాతగా విగ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతారలు హీరో హీరోయిన్లుగా చేసిన నానుం రౌడీ థాన్ సినిమా గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వినబడుతున్నాయి. ఆ సినిమా గురించే నయనతార, ధనుష్ మధ్య గొడవకి కారణం అని అందరికీ తెలిసిందే.అయితే అదే సినిమా నయనతార విగ్నేష్ శివన్ ప్రేమకి పునాది అని చెప్తూ ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు నటుడు శివ.
శివ అంటే ఎవరో అనుకుంటున్నారేమో ఈయన 12బి, పది నారు, చెన్నై 600028, వణక్కం చెన్నై వంటి సినిమాలలో నటించి మెప్పించిన నటుడు. ఈయన నటించిన నాడు నాటు మక్కలుం అనే సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నటుడు శివ నయనతార జంటపై వైరల్ కామెంట్స్ చేశాడు. వాళ్ళిద్దరూ కలవడానికి కారణం నేనే అంటూ ఆ కారణం ఏమిటో కూడా చెప్పాడు.
నిజానికి నానుం రౌడీ థాన్ సినిమాలో మొదట హీరో అవకాశం నాకే వచ్చింది, నేను ఆ సినిమాకి హీరోగా సెట్ అవుతానని దర్శకుడు విగ్నేష్ ఆ స్టోరీ నాకు చెప్పారు. ఆ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఆ పాత్రకి ఎందుకో నేను సెట్ అవ్వను అనిపించింది. అందుకే ఆ పాత్ర చేయడానికి నిరాకరించాను. అప్పుడే విజయ్ సేతుపతి ఆ పాత్ర చేయడం కోసం వచ్చారు. హీరోయిన్ గా నయనతార వచ్చింది.
ఒకవేళ నేను హీరో గా చేసి ఉంటే నయనతార నా పక్కన హీరోయిన్గా చేసి ఉండేది కాదు అప్పుడు నయనతార, విగ్నేష్ శివన్ లు కలిసేవారు కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ సినిమా నుంచి నేను తప్పుకోవడం వల్లే విగ్నేష్ శివన్, నయనతారలు ఇద్దరు కలవటం ప్రేమలో పడటం జరిగింది.కాబట్టి వేరే ప్రేమ పెళ్లికి కారణం నేనే అని చెప్పుకొచ్చాడు శివ. ఈ కామెంట్స్ ఆయన సరదాగా చేశారో, సీరియస్ గా చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.