స్టార్ హీరో డేరింగ్ డెసిషన్.. షాక్ లో అతని అభిమానులు!

మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాతో తెలుగు వాళ్ళని కూడా ఆకర్షించిన ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కెరియర్లో పీక్ స్టేజ్ లో ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన డెసిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ తన డెసిషన్ ఏమిటంటే అతను నటనకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడంట.

2025 తర్వాత నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు.ఇండస్ట్రీలో మంచి విజయాలు దక్కాయని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చుకునేందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను, అందరూ నా విన్నపం మన్నిస్తారని కోరుకుంటున్నాను, నాకోసం మద్దతిచ్చిన మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ముందుకు సాగుతున్న సమయంలో ఇది రీకాలిబ్రేట్ చేసి ఇంటికి తిరిగి వెళ్ళవలసిన సమయం అని నేను గ్రహించాను.

2025లో మనం ఆఖరిసారిగా కలుసుకోబోతున్నాం అని తన పోస్టులో తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. కెరియర్ ఫేడ్ అవుట్ అయిన హీరోలు సైతం ఇంకా తమ కెరియర్ ని కొనసాగించాలని పాకులాడుతారు. కానీ ఇలా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా డ్రాప్ అవుట్ అవ్వడం ఏమిటి అంటూ అతని అభిమానులు నిరాశకీ లోనవుతున్నారు. నువ్వు నా ఫేవరెట్ హీరో అని కొందరు, మీరు తిరిగి రండి మీకోసం మేము వెయిట్ చేస్తాము అని కొందరు.

మీరు భారతదేశం యొక్క అద్భుతమైన నటుడు దయచేసి వెళ్ళవద్దు అని మరి కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ మధ్యనే నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకోవడం గమనార్హం. అలాంటి నటుడు లాంగ్ గ్యాప్ తర్వాత అయినా మళ్లీ కెరియర్ కంటిన్యూ చేస్తాడని ఆశిద్దాం.