ఆఖరి దశలో హరిహర వీరమల్లు షూటింగ్.. ఎట్టి పరిస్థితులలోనూ అదే రోజు విడుదల!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మూవీ చివరి షెడ్యూల్లో జాయిన్ అయినట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాన్డేజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు ( నవంబర్ 2 ) షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మంగళగిరి సమీపంలోని ప్రత్యేక సెట్ ని నిర్మించారు.

మధ్యాహ్నం మూడు గంటల నుంచి షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు. ఈ సినిమా ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లు పూర్తి కావస్తుంది. మార్చి 28, 2025లో ఎట్టి పరిస్థితులలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మేఘ సూర్య ప్రొడక్షన్స్ పై ఏ ఎం రత్నం, ఏ దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పార్ట్ వన్ మూవీ మార్చ్ 28 2025 న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు కానీ అనివార్య కారణాల వలన ఆ బాధ్యతలనుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు.