Raj Kundra: అందులోకి నా భార్యను లాగొద్దు: మీడియాకు రాజ్‌కుంద్రా విజ్ఞప్తి

Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సోదాల వార్తలపై రాజ్‌ కుంద్రా స్పందించారు. కేసుకు సంబంధించి విచారణ జరుగుతోందని.. అందుకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మీడియాకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. సంబంధం లేని విషయాల్లో తన భార్య శిల్పా శెట్టి పేరును పదేపదే వాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

‘ఎంతటి సంచలనాత్మకమైనా కేసుల్లో అయినా.. అంతిమ విజయం న్యాయానిదే. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. దర్యాప్తునకు నేను పూర్తిగా సహకరిస్తున్నాను. సంబంధంలేని అంశాల్లోకి నా భార్య పేరును లాగుతున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీడియాకు ఇదే నా విజ్ఞప్తి.. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

మరోవైపు ఈ కేసు అంశంలో శిల్పా శెట్టిని లాగడంపై ఆమె తరపు లాయర్‌ కూడా స్పందించారు. శిల్పాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు అగౌరవపరిచే విధంగా ఫొటోలు, వీడియోలు ఉపయోగించకూడదని మీడియాకు హెచ్చరించారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేసిన కేసులో రాజ్‌ కుంద్రాను 2021 జూన్‌లో ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తలిసిందే.

ముంబై పోలీసుశాఖకు చెందిన ప్రాపర్టీ సెల్‌.. పోర్న్‌ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడిరది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్‌ వీడియలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్‌ వీడియోలు షూట్‌ చేసిన తర్వాత.. వాటిని వీట్రాన్స్‌ఫర్‌ ద్వారా విదేశాలకు ఆ కామెంట్‌ను పంపిస్తారు.