Shobitha Shivanna: కన్నడ నటి శోభిత మృతి కేసులో మరో ట్విస్ట్.. సూసైడ్ నోట్ స్వాధీనం!

తాజాగా కన్నడ సినీ టీవీ నటి శోభిత శివన్న మృతి చెందిన విషయం తెలిసిందే.. దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటికే ఆ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ద్రిగ్బ్యాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు ఆమె మరణానికి గల కారణాల పట్ల విచారణ కొనసాగిస్తున్నారు. కాగా నటి శోభిత హైదరాబాదులోనే గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సి బ్లాక్ లో తన భర్తతో కలిసి నివసిస్తున్న విషయం తెలిసింది. అయితే తాజాగా డిసెంబర్‌ 1న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్‌ అయ్యారు.

అయితే తాజాగా ఆమె రాసిన ఒక నోట్‌ బయట పడింది. శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్‌ ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సీరియల్స్ కి, సినిమాలకు దూరంగా ఉండడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుందా? లేదంటే తన భర్త సుధీర్ రెడ్డితో ఆమెకు ఏవైనా గొడవలు ఉన్నాయా? బయట ఇతర వ్యక్తులతో ఏవైనా సలహాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

కాగా ఆమె కనడ తో పాటు తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువ అయిన శోభిత ఈ విధంగా ఎందుకు చేసిందా అని అభిమానులు కూడా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్‌, పెళ్లి తర్వాత హైదరాబాద్‌ కు షిఫ్ట్‌ అయ్యాడు. ఆపై పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్‌ కు దూరమైంది. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఒక గదిలోకి వెళ్లింది. అయితే సుధీర్‌ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 10 గంటల అయినా ఆమె డోర్‌ తియకపోవడంతో శోభిత గది తలుపును పని మనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్‌ ఓపెన్‌ చేయకపోవడంతో సుధీర్‌ రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించిందని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.