Pushpa 2: ‘పుష్ప’ టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా వస్తున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ‘పుష్ప2: ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుష్ప 2 టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్‌ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్‌ థియేటర్‌లలో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్‌ షోలకు టికెట్‌ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్‌ 05 నుంచి 08 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది.

అలాగే.. డిసెంబర్‌ 09 నుంచి 16 వరకు సింగిల్‌ థియేటర్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు సింగిల్‌ థియేటర్‌లలో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నట్లు వెల్లడిరచింది. ఇక తెలంగాణ అడ్వాన్స్‌కు బుకింగ్‌కు సంబంధించి నేడు సాయంత్రం 4.56 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది.