బిగ్ అప్డేట్ : “ఆదిపురుష్” నుంచి ఊహించని పోస్టర్.!

 ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఎంతో అవైటెడ్ గా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి.

మరి ఈ భారీ సినిమా అయితే మన దేశపు చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించాడు. కాగా మొదటి నుంచి కూడా చాలా అంచనాలు ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ రిలీజ్ జూన్ కి వాయిదా పడింది.

పైగా అప్డేట్స్ కూడా పెద్దగా దీనితో ఈ భారీ సినిమా నుంచి ఇప్పుడు ఈరోజు శ్రీరామనవి అప్డేట్ కోసమే అంతా ఆసక్తిగా చూసారు. అయితే అనుకున్న టైం కే 7 గంటల 11 నిమిషాలకి చిత్ర యూనిట్ ఆ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే ఇది మాత్రం ఆసక్తి ఊహించనిది అని చెప్పి తీరాల్సిందే.

చాలా మంది మళ్ళీ సింగిల్ గా ప్రభాస్ పోస్టర్ నే రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ ఇందులో రాముడు, సీత, లక్ష్మణుడు ఆంజనేయుడు కూడా కలిపి కనిపిస్తున్నారు. వనవాసం అనంతరం అయోధ్యకి వచ్చినపుడు లాంటి తరహా పోస్టర్ గా ఇది కనిపిస్తుంది. దీనితో ఈ పోస్టర్ మాత్రం అసలు ఊహించని లెవెల్లో ఉందని చెప్పి తీరాలి. కాగా సినిమా 3డి లో అయితే జూన్ 16నే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.