యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ చిత్రాల్లో తన డైరెక్ట్ హిందీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే ఎన్నో అంచనాలు నెలకొల్పు కున్నప్పటికీ టీజర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో సినిమా రిలీజ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసేసారు.
మరి ఈ అవైటెడ్ సినిమా అయితే మరింత బెటర్ సీన్స్ మరియు గ్రాఫిక్స్ కోసం వచ్చే ఏడాది జూన్ కి వాయిదా వేయగా ఇపుడు అయితే మరో షాకింగ్ న్యూస్ ఫ్యాన్స్ కి తెలుస్తుంది. వచ్చే ఏడాది జూన్ కి కూడా ఈ సినిమా అనుమానమే అని ఇప్పుడు పలువురు అయితే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా వర్క్ సంతృప్తిగా రావట్లేదని అందుకే 2024 కి సినిమా మారిపోయే ఛాన్స్ ఉందని ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇంకా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కన్ఫర్మ్ కాలేదు కానీ లేటెస్ట్ గా ఈ టాక్ సినీ వర్గాల్లో మొదలైంది.
మరోపక్క దీని కన్నా చాలా చిన్న బడ్జెట్ సినిమా అయిన హనుమాన్ ఎన్నో రెట్లు బెటర్ గా ఉండడంతో నార్త్ ఆడియెన్స్ లో కూడా ఆదిపురుష్ పై అంచనాలు తగ్గిపోయాయి. మొత్తంగా అయితే ఈ సినిమా విషయంలో ఏమవుతుందో ఏంటో?