ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్… దానికోసమే ఫ్లాట్ కొన్నారా?

Amitabh Bachchan responding well to COVID treatment

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఇప్పటికి పలు సినిమాలలో కీలక పాత్రలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో నటించడమే కాకుండా మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెరపై వెండితెరపై ఇప్పటికి ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బిగ్ బీ సినిమాలలో కొనసాగుతూనే భారీగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముంబైలో పలు ప్రాంతాలలో ఖరీదైన ఆస్తుపాస్తులను కొనుగోలు చేసిన ఈయన ముంబైలో జుహు ప్రాంతంలో ఓ ఖరీదైన ఇంటిలో తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో మరొక ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతంలోని పార్థినాన్ సొసైటీలో ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో 31వ ఫ్లోర్లో 12 వేల చెదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఫ్లాట్ భారీ ధరకు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఫ్లాట్ ఎంత ఖరీదుకు కొన్నారు అనే విషయాన్ని మాత్రం బయటకు తెలియజేయలేదు.ఇలా జుహ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈయన ఈ ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయడానికి గల కారణం కేవలంపెట్టుబడుల ప్రయోజనాల కోసమే కొనుగోలు చేశారని తెలుస్తుంది. అయితే తన కుటుంబం ఇక్కడ నివసించడానికి కాదని, తన కుటుంబ సభ్యులు జూహు ప్రాంతంలోని నివసిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తాజాగా రణబీర్ కపూర్ అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే ప్రభాస్ దీపికా పదుకొనే నటిస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాల్లో కూడా బిగ్ బీ సందడి చేయనున్నారు.