ఇండస్ట్రీ టాక్ : రాజమౌళి, శంకర్ తర్వాత చరణ్ కి షాకింగ్ డైరెక్టర్.!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో పాగా వేసిన మరో మన టాలీవుడ్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి చరణ్ అయితే హీరోగా చేస్తున్న భారీ సినిమా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో వర్క్ చేసిన చరణ్ నెక్స్ట్ ఏ దర్శకుణ్ణి లైన్ లో పెడతాడు.

అనే దానికి ఇప్పుడు ఓ క్రేజీ సమాధానం అయితే సినీ వర్గాల నుంచి బయటకి వినిపిస్తుంది. పాన్ ఇండియా వైడ్ భారీ క్రేజ్ ఉన్నటువంటి ఇద్దరు దర్శకులు శంకర్ అలాగే రాజమౌళి లతో వర్క్ చేసిన చరణ్ ఇప్పుడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి ఆ దర్శకుడు అయితే మరెవరో కూడా కాదు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు అట. అయితే బుచ్చిబాబు తో చరణ్ సినిమా ఉండొచ్చని గత కొన్నాళ్ల కితమే టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా అయితే బుచ్చిబాబు తన స్క్రిప్ట్ తో చరణ్ ని మెప్పించినట్టుగా ఇన్సైడ్ టాక్.

అంతే కాకుండా ఈ సినిమా కూడా భారీ స్థాయిలోనే పాన్ ఇండియా లెవెల్లో ఉండగా దీనిని కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. మొత్తానికి అయితే చరణ్ ని డైరెక్ట్ చేసే నెక్స్ట్ దర్శకుడు దొరికేసాడని చెప్పొచ్చు.