Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు మెగా కోడలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఉపాసన ఇప్పటికే ఎన్నో రకాల వ్యాపారాలను ప్రారంభించి వ్యాపారవేత్తగా, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎంతో బిజీగా ఉన్నారు అలాగే ఇటీవల ఈమె తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్పర్సన్ గా బాధ్యతలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉండే ఉపాసన తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. అలాగే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఉపాసన తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా… తన సాయిబాబా వ్రతం పూర్తి అయిందని తెలియజేశారు గురు పౌర్ణమి రోజు ఈమె సాయిబాబా వ్రతాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా తొమ్మిది వారాలపాటు ఈ వ్రతాన్ని కొనసాగించిన ఉపాసన తాజాగా ఈ వ్రతాన్ని పూర్తి చేశారని తెలియజేశారు.
ఇక ఈ విషయాన్ని ఈమె తెలియజేస్తూ.. గురు పౌర్ణమి రోజు ప్రారంభమైన నా ఈ సాయిబాబా వ్రతం 9 వారాలపాటు కొనసాగింది. శాంతి విశ్వాసం స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్స్ లత సిస్టర్ తో కలిసి ప్రారంభించాను. నేను అడిగిన దానికంటే ఎక్కువగా సాయిబాబా ఆశీర్వదించినందుకు రుణపడి ఉంటాను. మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అత్తమ్మాస్ కిచెన్ ద్వార ఈరోజు ఉచితంగా భోజనాలు వడ్డిస్తున్నాము జై సాయిరాం అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
