కరోనా బారిన పడ్డ అడివి శేష్… ఆ రెండు సినిమాలను చూడలేకపోతున్న అంటూ కామెంట్స్?

కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గినప్పటికీ అక్కడక్కడ కొన్నిచోట్ల కొందరు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో అడివి శేష్ సైతం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అడివి శేష్ తెలియజేస్తూ ప్రస్తుతం తాను బాగున్నానని అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. ఇలా ఐసోలేషన్లో ఉన్నటువంటి ఈయన శుక్రవారం విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు విడుదలై మంచి హిట్ అందుకున్నాయని తెలిసినప్పటికీ ఆ సినిమాలను చూడలేకపోతున్నానని తెలిపారు.

ఇలా ఈయన కరోనా రావడం చేత సినిమాలను చూడలేకపోతున్నానని అయితే తన అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తూ అభిమానులు మాత్రం మార్నింగ్ షో ఒక సినిమా, మ్యాట్నీ షో మరో సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే అడివి శేష్ మేజర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం విశేషం.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరికెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ ప్రస్తుతం హిట్ సినిమా సీక్వెల్ చిత్రం హిట్ 2 లోనటిస్తున్నారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతుండగా ఈయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని చెప్పాలి.