మన భారతీయ సంస్కృతిలో దానధర్మాలకు చాలా విశిష్టత ఉంది. దానాలలో ఎన్నో రకాల దానాలు ఉంటాయి. అన్నదానం, ధన దానం, వస్త్ర దానం, వస్తున్నాను ఇలా ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటారు. మన జాతకం ప్రకారం కొన్ని సందర్భాలలో దానాలు చేయటం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే ఎటువంటి జాతక దోషాలు లేకపోయినా కూడా పేదవారికి అన్నదానం చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఏవైనా ప్రత్యేక సందర్భాలలో లేదా పండుగల సందర్భంగా ఇలాంటి దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది కదా అని ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇతరులకు దానం చేయకూడదు.
కొన్ని రకాల వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల ఆ దానం చేసిన ఫలితం లభించకపోగా..దానం తీసుకున్న వారి కంటే ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇతరులకు ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉండాలని భావించి ఆ దేవిని పూజిస్తూ ఉంటారు. అయితే మనం పొరపాటున చేసే కొన్ని దానాల వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి దూరం అవుతుంది. ఇతరులకు లక్ష్మీదేవి ఫోటోని దానం ఇవ్వటం వల్ల చేతులారా మనం లక్ష్మీదేవిని మన ఇంటి నుండి వారి ఇంటికి పంపినట్లు అవుతుంది.
అలాగే లక్ష్మి గణేశుడు ఉన్న వెండి నాణాలను ఇతరులకు దానం చేయటం వల్ల మనం చేపట్టిన పనులలో విఘ్నాలు ఎదురై మన ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల లక్ష్మీ గణేశుడు ఉన్న వెండి నాణేలను ఇతరులకు దానం చేయరాదు. అలాగే పాత్రలు దానం చేయాలనుకునేవారు వాటిని సంపన్నులకు దానం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సంపన్నులు వాటిని ఉపయోగించకపోవడం వల్ల ఆ దానం చేసిన ప్రతిఫలం మనకు లభించదు. అందువల్ల పాత్రలు దానం చేయాలనుకునేవారు పేదరికంలో ఉన్నవారికి దానం చేయటం వల్ల మనం చేసిన దానానికి ప్రతిఫలం ఉంటుంది.