S.I: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి వచ్చిన విషయం తెలిసిందే. పరిటాల కుటుంబం చేతిలో హత్యకు బలి అయినటువంటి లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లికి వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు.
ఇక పాపిరెడ్డి పల్లికి చేరుకున్న వైయస్ జగన్ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు టోపీ పై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి వాచ్మెన్ గా పనిచేయదు అంటూ తెలిపారు.
చంద్రబాబు నాయుడు పాలన ఎల్లకాలం ఉండదు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ అందరిని ఇబ్బందులకు గురి చేశారో వారి అంతు చూస్తానని వారి యూనిఫామ్ తొలగించి జాబ్ పీకేస్తానని తెలిపారు. మీరు చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా తిరిగి చెల్లించి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాను అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై సత్య సాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. మేము పోలీసు ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడి చదవాము. రన్నింగ్ పాస్ అయ్యి కొన్ని వేల మందినీ వెనక్కి నెట్టి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవడో వచ్చి ఊడదీయాడానికి ఇదేం అరటి తొక్క కాదు. మేము చాలా నిజాయితీగానే ఉద్యోగాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం.. నిజాయితీగానే చస్తాము అడ్డదారులు తొక్కము.. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఈయన ఆగ్రహం వ్యక్తం జగన్మోహన్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.
