Renu Desai: నాకు రాజకీయాలలోకి రావాలని ఉంది… పవన్ మాజీ భార్య కామెంట్స్!

Renu Desai : సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలెబ్రెటీలు రాజకీయాలలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలా రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రాజకీయాలలో కూడా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. తనకి కూడా రాజకీయాలలోకి రావాలని ఉంది అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాకు రాజకీయాలలోకి రావాలి అంటూ ఇదివరకే ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని తెలిపారు.

రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ కూడా నాకు రాజకీయాలలోకి వెళ్లాలని కోరిక ఉంది కాని విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నానని తెలిపారు.సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని…ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని…స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాను అందుకే నా స్నేహితులు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అంటూ మాట్లాడతారని రేణు దేశాయ్ తెలిపారు.

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని…ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని తెలిపారు. తాను భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తే కనుక అందరికీ చెప్పే రాజకీయాలలోకి వస్తానని ఈమె పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.