Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ లో చదువుతున్నటువంటి శంకర్ పాఠశాలలో అనుకోకుండా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ అగ్ని ప్రమాదంలో చిన్నారి చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయి అలాగే పొగ ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో సమస్య వచ్చిందని తద్వారా స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.
ఇలా పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ అగ్ని ప్రమాదానికి గురయ్యారని విషయం తెలియగానే అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ చిన్నారి క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు.
ఈయన అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లాలలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో రోజు పర్యటన సందర్భంగా తన కుమారుడి గురించి తెలియడంతో పవన్ కళ్యాణ్ తన పర్యటనను పూర్తి చేసుకుని అనంతరం సింగపూర్ బయలుదేరారు. అయితే మొదటిసారి తన కొడుకు ఆరోగ్యం పై పవన్ కళ్యాణ్ స్పందించారు .
చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నా కానీ.. ఇంతలా అవుతుందని అనుకోలేదని బాధపడ్డారు. ఈ అగ్ని ప్రమాదంలో శంకర్ కాళ్లకు చేతులకు గాయాలు అయ్యాయి.ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.ప్రస్తుతం ఆస్పత్రిలో బ్రంకోస్కోపీ చేస్తున్నారని అన్నారు. దీర్ఘకాలంలో పిల్లాడిపై ఈ ప్రభావం ఉంటుందన్నారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని తెలిపారు. నా పెద్ద కుమారుడు పుట్టినరోజు నాడే చిన్న కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.