హిందూమతంలో అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ప్రతి నెలకు ఒకసారి ఈ అమావాస్య వస్తుంటుంది. ఈ అమావాస్య రోజున కొంతమంది ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజున చేసే ఉపవాసం, పూజలు, స్నానం, దానధర్మాలు మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యల్లో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు.
సోమవతి అమావాస్య రోజున స్నానం, దానంతో పాటు పితృపూజ కూడా చేస్తారు. అందుకే ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున పిత్రా దోషం నుంచి బయటపడటానికి కొన్ని ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోతాయని, పూర్వీకులు సంతుష్టులవుతారు. తమ కుటుంబ సభ్యులపై ఆశీస్సులను అందజేస్తారని నమ్మకం.
పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలోని ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు. కాగా మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు క్రింద 11 దేశీ నెయ్యి దీపాలను వెలిగించి పూర్వీకులను నిర్మలమైన హృదయంతో పూజించాలి. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతోషిస్తారు. సోమవతి అమావాస్య రోజున పాలు, అన్నం దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే నల్ల నువ్వులతో పాటు పాలు , అన్నం కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఏదైనా కారణాల వల్ల పూర్వీకులు కోపంతో ఉంటే ఆ కోపం కూడా తొలగిపోతుంది. సోమవతి అమావాస్య రోజున పరమశివుడిని, పార్వతిని పూజించే సంప్రదాయం ఉంది. అందుకే సోమవతి అమావాస్య నాడు శివ పార్వతిని తప్పక పూజించాలి. ఇలా చేయడం వలన శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయి. సోమవతి అమావాస్య రోజున గంధం, శంఖం, కొబ్బరికాయ, బిల్వ పత్రం వంటి వాటిని సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.