Diwali: దేశవ్యాప్తంగా దీపావళి పండగ శోభ!

Diwali: దేశవ్యాప్తంగా దీపావళి పండగ శోభ వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ దేవిని ఆడ పడుచులు పూజిస్తారు. తమకు సిరి, సంపదలు కలుగజేయాలని కోరతారు. అన్నింటికి మంచి ధన త్రయోదశి రోజు బంగారం కొనాలన్న కోరిక ఉంది. ధన త్రయోదశికి వ్యాపారులు ఆఫర్లు ప్రకటించారు. పండగ సమయంలో బంగారం, వెండి కొనడం కామన్‌. పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్టాల్ల్రోనే.దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా కొంచెం తగ్గాయి. అయితే పెరిగినప్పుడు వేలల్లో పెరగడం, తగ్గినప్పుడు మాª`తరం వందల్లో తగగ్గడం మార్కెట్‌ పరిస్థితికి అద్దం పడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం, ద్రవ్యోల్బణం, రూపాయితో డాలర్‌ మారకం విలువ ఆధారంగా బంగారం ధరలో మార్పు జరుగుతుంటుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73, 590గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం లో కూడా ఇదేవిధంగా ఉంది. 22 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.80,280గా ఉంది. విజయవాడ విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,590గా ఉంది.

కోల్‌ కతాలో రూ.73,590గా ఉంది. ఢిల్లీలో రూ.73,740గా ఉంది. చెన్నైలో రూ.73,590గా ఉంది. ముంబై, కోల్‌ కతా, చెన్నైలో మేలిమి బంగారం ధర రూ.80,280గా ఉంది. ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంది. రూ.80,430గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో ఇలానే ఉంది. ముంబై, ఢల్లీి, కోల్‌ కతా, పుణెళిలో కిలో వెండి ధర రూ.97,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 96 వేల 900గా ఉంది.

ఇకపోతే ధన త్రయోదశి 2024 వచ్చేసింది. హిందువులకు ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటైన ఈ పండగ అక్టోబర్‌ 29న మంగళవారం జరగనుంది. పవిత్రమైన ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాదంతా శుభం జరుగుతుందని, ఆరోగ్యం, సిరిసంపదలు నిండుతాయని హిందువులు విశ్వసిస్తుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ధన్వంతరీ, లక్ష్మీ దేవి, వినాయకుడు, కుబేర దేవతలను పూజిస్తుంటారు. బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి దేవుళ్లను పూజిస్తారు.

ముఖ్యంగా బంగారం, వెండి లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనవి కావడంతో వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనే విషయంలో కస్టమర్లు అజాగ్రత్తగా ఉండకూడదు. బంగారం స్వచ్ఛతను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి. కొంతమంది వ్యాపారులు తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మోసాలకు తావివ్వకుండా విూకు విూరే స్వచ్ఛతను పరిశీలించు కోవడం చాలా ఉత్తమం. అందుకు సులభమైన ఐదు మార్గాలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (ఃఎªూ) హాల్‌మార్క్‌ బంగారం నాణ్యత పరిశీలనలో అత్యంత విశ్వసనీయమైనది.

బంగారం స్వచ్ఛతను ఈ మార్క్‌ నిర్దారిస్తుంది. హాల్‌మార్క్‌లో క్యారెట్లలో స్వచ్ఛత, స్వర్ణకారుడి గుర్తింపు వంటి సమాచారం ఉంటుంది. హాల్‌మార్క్‌ ఉన్న బంగారు ఆభరణాల ప్రతి ముక్కకు ఒక ప్రత్యేకమైన హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఉంటుంది. గోల్డ్‌ ప్రామాణికతను నిర్దారించడంలో ఈ నంబర్‌ సహాయపడుతుంది. బిస్‌ కేర్‌ యాప్‌ని ఉపయోగించి ఈ నంబర్‌ను ధ్రువీకరించుకోవచ్చు. ఆభరణాల స్వచ్ఛత, రిజిస్టేష్రన్‌, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ వంటి సమాచారాన్ని విూరే స్వయంగా తెలుసుకోవచ్చు.

బంగారం కొనాలనుకునే వారు యాప్‌ స్టోర్‌లో బీఐఎస్‌ కేర్‌ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ సాప్ట్‌వేర్‌ ద్వారా హెచ్‌యూఐడీని గుర్తించవచ్చు. తద్వారా విూరు కొంటున్న బంగారం నిజమైనదా కాదా అని విూరే నిర్దారించుకోవచ్చు. ఇందులో స్వర్ణకారుడి వివరాలతో పాటు హాల్‌మార్కింగ్‌ సెంటర్‌కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. బంగారు ఆభరణాలు వివిధ రకాల స్వచ్ఛత స్థాయిలలో ఉంటాయి. నాణ్యతను తరచుగా క్యారెట్‌లలో కొలుస్తారు. సాధారణంగా ధన త్రయోదశి సమయంలో 22 క్యారట్ల బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు.

అయితే 24 క్యారెట్ల బంగారం ఎక్కువ నాణ్యత కలిగివుంటుంది. బంగారం నాణ్యతను అక్కడికక్కడే వేగంగా గుర్తించేందుకు అయస్కాంతాన్ని ఉపయోగింవచ్చు. నిజమైన బంగారం అయస్కాంతానికి అతుక్కోదు. ఒకవేళ అతుక్కున్నా అటు ఇటు కదలాడినా అది స్వచ్ఛమైనది కాదని అనుమానించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారు బరువు, క్యారెట్‌, హాల్‌మార్క్‌ ధృవీకరణతో కూడిన పూర్తి బిల్లును నగల వ్యాపారి నుంచి తీసుకోవాలి. భవిష్యత్తులో అమ్మకాలు లేదా విక్రయాల విషయంలో ఈ బిల్లు ఉపయోగపడుతుంది.

Public EXPOSED: Pawan Kalyan and Chandrababu Over 140 Days Ruling | Ys Jagan | Ap Public Talk | TR