Directors: దర్శకుల దూకుడు: హీరోల్ని మించి డైరెక్టర్స్ డామినేషన్!

ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కొత్త దిశ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ హీరోల ఆధిపత్యం చూసిన బాక్సాఫీస్‌కి, ఇప్పుడు దర్శకుల ఆలోచనలు కొత్త శకం తెచ్చేశాయి. ఒకప్పుడు కథను తెరకెక్కించడమే లక్ష్యంగా ఉండే డైరెక్టర్లు, ఇప్పుడు విజన్, స్కేల్, టెక్నాలజీ పరంగా హీరోలకంటే ముందుండే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తదనాన్ని కోరే ప్రేక్షకుల అభిరుచిని దర్శకులు సరిగ్గా పసిగట్టారు.

ఈ మార్పుకు నాంది పలికినవారిలో రాజమౌళి ముందు వరుసలో నిలిచారు. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ కోసం ఆయన అంతరిక్షం నుండి అడవుల దాకా ప్రయాణించే కథను తీసుకువస్తున్నారు. ఇది ఒక సినిమా కాదని, పాన్ వరల్డ్ మ్యాజిక్ అంటూ రాజమౌళి స్కెచ్ వేశారంటే, దానికి ఆయన ట్రాక్ రికార్డ్‌నే తార్కాణం.

ఇక సందీప్ రెడ్డి వంగా తీస్తున్న “స్పిరిట్” అనే యూనివర్సల్ కాన్సెప్ట్ మూవీ కూడా ఇండియన్ సినిమాకు మరో లెవెల్ చూపించనుంది. బలమైన పాత్రలు, యాక్షన్, ఎమోషన్‌ అన్నీ కలిపే ఆ ప్రయత్నం హైప్‌ను పెంచుతోంది. అట్లీ అండ్ బన్నీ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కూడా అంచనాలకు మించిన టెక్నికల్ ప్రెస్టేజ్ మూవీగా మారబోతోంది. హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్, డీ-ఏజింగ్ వంటివి ఇందులో ఉండబోతున్నాయట.

నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ కూడా మైథాలజీని ఆధునిక టెక్నిక్‌తో నెట్టుకొస్తోంది. రణబీర్ సాయి పల్లవి లుక్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. మొత్తానికి ఇది హీరోల కాలం కాదు, ఇది దర్శకుల కాలం. కథ చెప్పడమే కాదు, కొత్తదనం తేవాలనే ఆరాటంతో దర్శకులు నెక్స్ట్ లెవెల్ స్టాండ్‌ర్డ్స్ నెలకొల్పుతున్నారు. ఇక వీరి ప్రయత్నాలకు ఫలితం ఎలా వస్తుందో, ప్రేక్షకుల స్పందన ఏం చెప్పేదో వేచి చూడాలి.