ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఎంతో గొప్ప పాత్రధారిగా మారింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఈ మహిళ తన జీవితం ఎలా మారిందో మోదీకి వివరించారు. అయితే, ఈ సమావేశంలో జరిగిన చిన్న సంభాషణ దేశవ్యాప్తంగా అందరిని దృష్టి ఆకర్షించింది.
ఆ మహిళ మోదీతో మాట్లాడుతూ, ‘‘సార్ నాకు హిందీ రాదు’’ అని సంకోచంగా చెప్పగా… మోదీ తలూపుతూ ‘‘పర్వాలేదు, తెలుగులోనే మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించారు. ఈ చిన్న గెస్ట్‌చర్‌కి ఆమె మాత్రమే కాదు, అక్కడి వారందరూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె తన జీవన ప్రయాణాన్ని వివరించారు.
‘‘2019లో కెనరా బ్యాంక్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌లో 13 రోజులపాటు జనపనార (జూట్) బ్యాగ్‌ల తయారీపై శిక్షణ తీసుకున్నాను. అనంతరం బ్యాంకే రూ.2 లక్షల ముద్రా రుణం ఇచ్చింది. దాని ద్వారా వ్యాపారం ప్రారంభించాను. వాయిదాలు క్రమంగా చెల్లించడంతో 2022లో మరోసారి రూ.9.5 లక్షల రుణం మంజూరైంది’’ అంటూ తన అభివృద్ధి గురించి వివరించారు.
ప్రస్తుతం ఆమె 15 మంది గృహిణులను ఉద్యోగంలో పెట్టుకున్నారు. ‘‘వారంతా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం ద్వారా శిక్షణ పొందినవారే. నేను కూడా ఆ కేంద్రంలోనే నేర్చుకున్నాను. ఇప్పుడు అదే సంస్థలో నేనే శిక్షకురాలిని కూడా. ఇదంతా ముద్రా యోజన వల్లే సాధ్యమైంది’’ అని చెప్పారు. ఆమె మాటలు వినిన మోదీ అభినందిస్తూ ఆమె సాహసాన్ని ప్రశంసించారు.
That Lady: I Don’t know Hindi sir.
Modi Ji: No problem, you can speak in Telugu.
— Adv Gopinadh MN (@GopinadhMN) April 8, 2025