మీ ఆధార్ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటే సిమ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సిమ్ పొందాలంటే మీ ఆధార్ వివరాలు అందించాల్సి ఉంటుంది. భారత పౌరులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. ప్రతి పనికి ఆధార్ కార్డ్ ఉండటం చాలా అవసరం . అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆధార్ కార్డును అనేక ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగిస్తున్నారు. అలాగే సిమ్ తీసుకోవటానికి కూడా ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలామంది సిమ్ కోసం తెలిసి లేదా తెలియక మీ కార్డ్‌కి యాక్సెస్‌ను పొందుతారు. ఇలా ఇతరులు మీ ఆధార్ కార్డు వల్ల మీరు సమస్యల్లో పడవలసి వస్తుంది.

ఈ క్రమంలో ఎవరైనా మీ ఆధార్ కార్డ్‌ని దుర్వినియోగం చేస్తున్నారు లేదా మీ ఆధార్ కార్డ్‌లోని సిమ్ కార్డ్‌ని మరొకరు తీసుకోవటం వంటి కేసులను అరికట్టడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (TAFCOP పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ సహాయంతో మీ ఆధార్ కార్డులో ఎన్ని నంబర్లు రిజిస్టర్ అయ్యాయో చెక్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీ ఆధార్ కార్డుపై ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

• ముందుగా TAFCOP అధికారిక వెబ్‌సైట్‌ ( https://tafcop.dgtelecom.gov.in/ ) లో లాగిన్ అవ్వాలి.
• దీని తర్వాత అక్కడ మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే OTP వస్తుంది.
• ఆ తర్వాత అందుకున్న OTPని ఎంటర్ చేసి దానిని ధృవీకరించండి.
• ఇలా చేయడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డ్‌లో ఇవ్వబడిన SIM కార్డ్ నంబర్‌ల జాబితాను పొందవచ్చు.

తెలియని నంబర్‌ను ఎలా తొలగించాలి..?

ఒకవేళ ఆ లిస్ట్ లో ఏదైనా తెలియని నంబర్‌ ఉంటే దానిని కూడా తీసివేయవచ్చు. అలాగే దానిని నివేదించవచ్చు. దీని కోసం మీరు ఎడమ చెక్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మీరు రిజిస్టర్డ్ నంబర్‌ను నివేదించగలరు.