లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.45 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

ప్రస్తుతం ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసినా లక్ష రూపాయలకు 45 లక్షల రూపాయలు పొందడం సాధారణంగా జరగదనే సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఉన్నా సరైన విధంగా పెట్టుబడులు పెడితే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ షేరులో 10 ఏళ్ల క్రితం 10,000 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు ఏకంగా 4.5 లక్షల రూపాయలు సొంతం చేసుకుంటున్నారు.

పదేళ్ల క్రితం ఇందులో ఎవరైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం ఆ మొత్తం ఏకంగా 45 లక్షల రూపాయలు అయ్యి ఉండేది. ఈ మధ్య కాలంలో ఏ కంపెనీ స్టాక్స్ ఈ స్థాయిలో లాభాలను అయితే అందించలేదనే చెప్పాలి. డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను సైతం పొందే అవకాశం ఉంది.

ఆరున్నర కోట్ల కంటే ఎక్కువమంది ఈ మల్టీబాగర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ షేరు 5715 రూపాయలుగా ఉంది. నిపుణుల సలహా ప్రకారం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఈ స్టాక్ గురించి అవగాహన ఉంటే మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించనుండగా దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకుంటే అవకాశం ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండాలని అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.