లక్ష్మీ కటాక్షం దూరం చేసే అలవాట్లు.. ఇలా చేస్తే దరిద్రం తప్పదంట..!

పెద్దల, రుషులు మాట ప్రకారం.. ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటే ధనం, ధాన్యం, సుఖ శాంతులు తామరతంపరగా వస్తాయని అంటారు. కాని అదే లక్ష్మీ దేవి మన ఇల్లు దాటితే.. ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు సంపాదించినా, ఆ డబ్బు నిలవదు, ఇబ్బందులు తప్పవని చెబుతారు. ఈ విషయం కేవలం పూరాణాలు, శాస్త్రాల్లో మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో కూడా నిజమే అని చాలామంది నమ్ముతారు.

ఇక అసలు విషయం ఏంటంటే… మనం రోజూ చేసే కొన్ని చిన్నచిన్న అలవాట్లు, మనకే తెలియకుండా ఆ సిరిసంపదల తలుపులు మూయిస్తాయట. ఉదాహరణకు, టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడపడం. అవును చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది.. మొబైల్ పట్టుకుని కూర్చోవడం, మాట్లాడడం, ఆలోచించడం.. కానీ పెద్దల ప్రకారం ఇది మంచి లక్షణం కాదు. అనవసరంగా ఎక్కువసేపు టాయిలెట్‌లో ఉండటం దరిద్రాన్ని ఆహ్వానిస్తుందట.

అంతేకాదు, టాయిలెట్‌లో ఉండగానే ఎక్కువగా మాట్లాడటం కూడా లక్ష్మీ కటాక్షానికి అడ్డుపడతుందని నమ్మకం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మహిళలు టాయిలెట్‌లో నిలబడి తల దువ్వుకోవడం కూడా ఆర్థిక సమస్యలకు దారితీస్తుందట. ఇది శుభప్రదం కాదని, ఇంట్లో సానుకూల శక్తి తగ్గుతుందని పండితులు హెచ్చరిస్తారు.

అంతేకాదు ఒక వ్యక్తి ఎప్పుడూ తన తల్లిదండ్రులను కించపరిచే మాటలు మాట్లాడుతుంటే.. ఆ ఇంట్లో ఎప్పటికీ పేదరికం దూరం కాదట. ఇది కేవలం శాపంలా కాకుండా, మనసులోని నెగటివిటీ కారణంగా వస్తుందని పండితులు చెబుతారు. పెద్దలకు గౌరవం ఇవ్వడం, వారి ఆశీర్వాదం పొందడం అనేది సిరిసంపదలను ఆకర్షించే శక్తి వంతమైన పద్ధతి అంటారు పండితులు.

సంపదలు, సుఖాలు, శాంతి ఇవన్నీ కేవలం కష్టపడటం ద్వారానే రావు.. మన ప్రవర్తన, అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే, పెద్దలు చెప్పిన ఈ మాటలు పాతకాలపు మాటలా కనిపించినా, వాటి వెనక ఉన్న ఆచరణీయతని గుర్తిస్తే, మన జీవితం మరింత సాఫల్యంగా మారుతుందని అనిపిస్తుంది. కాబట్టి, లక్ష్మీ కటాక్షం కావాలంటే శుభ్రత, సమయపాలన, పెద్దలకు గౌరవం.. ఇవన్నీ పాటించాలి. ఆ చిన్న అలవాట్లే మన అదృష్టాన్ని మలుస్తాయి.. లేదా దరిద్రం తప్పదు అంటున్నారు పండితులు.