జుట్టుకు రంగు వేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ తప్పులు చేస్తే మాత్రం ప్రమాదమా?

మనలో చాలామంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది మాత్రం మరింత అందంగా కనిపించాలనే ఆలోచనతో జుట్టుకు రంగు వేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జుట్టుకు రంగు వేసుకునే వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జుట్టుకు వేసుకునే రంగు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

జుట్టుకు వేసే రంగులో ఎన్నో కెమికల్స్ ను ఉపయోగిస్తారు. ఈ కెమికల్స్ వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టు సహజ రంగును కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని హెయిర్ డైలు కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి. కచ్చితంగా హెయిర్ డై వాడాలని అనుకునే వాళ్లు మన చర్మానికి సూట్ అయ్యే సెమీ హెయిర్ డైని ఎంచుకుంటే మంచిది.

తరచూ హెయిర్ డైలను వాడేవాళ్లను జుట్టు రాలే సమస్య కూడా వేధిస్తోందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. హెయిర్ డైలు చాలామందిలో ఆస్తమా సమస్యకు కారణమవుతున్నాయి. హెయిర్ డై పౌడర్ కొన్నిసార్లు గోర్ల ద్వారా ఆహారం తినే సమయంలో శరీరంలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. స్టైలింగ్ టూల్స్ ను ఉపయోగించే వాళ్లు జుట్టు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

హెయిర్ డైలలో ఫార్మాల్డిహైడ్, బొగ్గు , సీసం ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. హెయిర్ డైలకు ప్రత్యామ్నాయంగా హెన్నా వాడితే మంచిది. హెయిర్ డైల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.