అరటి ఆకులో తింటే ఏకంగా ఇన్ని లాభాలా.. ఆ సమస్యలు అన్నీ కచ్చితంగా దూరమా?

మనలో చాలామంది అరటి ఆకులో భోజనం చేయడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అరటి ఆకుల్లో భోజనం పురాతన భారతీయ సంప్రదాయం కాగా సౌత్ ఇండియాలో ఇప్పటికీ చాలామంది ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. పరిశుభ్రమైన అరటి ఆకులో అహార పదార్థాలను వడ్డించుకుని చేతితో తింటే ఎన్నో లాభాలు ఉండటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి.

అరటి ఆకులో సహజ సిద్ధమైన కర్బన సమ్మేళనాలు ఉండటం వల్ల కేన్సర్, గుండె జబ్బులు లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా లభించడంతో పాటు నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా పని చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అరటి ఆకులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు వల్ల సూక్ష్మజీవులు నాశనమయ్యే అవకాశాలు ఉంటాయి.

ఆరటి ఆకుపై మైనపు పూత ఉండటం వల్ల వేడి ఆహార పదార్థాలు వడ్డించిన సమయంలో ఈ మైనపు పూత కరిగి మంచి సువాసన వెదజల్లే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అరటి ఆకులను వినియోగించడం వల్ల పర్యావరణానికి సైతం ఎలాంటి హాని కలగదు. అరటి ఆకులు పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి అన్ని ఆహార పదార్థాలను ఒకేసారి వడ్డించే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు.

సింథ‌టిక్ ప్లేట్ల‌తో పోలిస్తే అర‌టి ఆకులు ఎలాంటి టాక్సిన్స్‌ను, హానికారక కెమిక‌ల్స్‌ను ఆహారంలోకి విడుద‌ల చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి అరటి ఆకులను వినియోగిస్తే ఎంతో మంచిది. ప్రస్తుతం పెద్దపెద్ద రెస్టారెంట్లలో సైతం అరటి ఆకులను ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.