చిన్నపిల్లలకు దిష్టి తీయడం ఎలానో తెలుసా… కర్పూరంతో మాత్రమే చిన్నారులకు దిష్టి తీయాలని మీకు తెలుసా?

dos-and-donts-of-raising-difficult-child_sm

సాధారణంగా ఒకరు కాస్త అందంగా ఉన్న లేదా అందవిహీనంగా ఉన్న అందరూ వారిపై దృష్టి పెట్టడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరి దృష్టి మనపై పడటం వల్ల దిష్టి తగులుతుంది. ఇలా దిష్టి తగిలినప్పుడు ఒంట్లో ఏదో నలతగా ఉండడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే వెంటనే ఇలాంటి ఇబ్బంది మనకు కలిగినప్పుడు వెంటనే దిష్టి తీయాలని చాలామంది సూచిస్తుంటారు.అయితే పెద్ద వారికి చాలా మంది చమురు వత్తి లేదా చీపురు ఉప్పు వంటి వాటిని ఉపయోగించి దిష్టి తీస్తారు.

ఇక చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కనుక వారికి వెంటనే దిష్టి తగులుతుంది అయితే చిన్న పిల్లలకు దిష్టి తగిలినప్పుడు పిల్లలు తరచూ ఏడవడం సరిగా నిద్రపోకుండా ఉండడం వంటివి చేస్తుంటారు. అందుకే పిల్లలకు ప్రతిరోజు తప్పనిసరిగా దిష్టి తీయాలని పెద్దలు చెబుతుంటారు.అయితే పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు కూడా ఉప్పు చీపురుతో దిష్టి తీయకూడదు చిన్నపిల్లలకి ఎప్పుడూ కూడా కర్పూరం తోనే దిష్టి తీయాలి.

మూడు బిల్లల కర్పూరాన్ని ఒక చిన్న ప్లేట్ లో వేసి పిల్లలకి చుట్టూ మూడు సార్లు దిగదీసి కర్పూరం వెలిగించాలి. అనంతరం ఈ కర్పూరాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా కర్పూరం కరిగిపోయే కొద్ది చిన్న పిల్లలకు తగ్గిన దిష్టి కూడా తొలగిపోతుంది.ఇక చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండడానికి వారి కాలికి లేదా చేతులకు నల్లటి గాజులు నల్లటి దారాన్ని కట్టాలి అలాగే నల్లటి బొట్టు పెట్టడం వల్ల చిన్న పిల్లలకు వెంటనే దిష్టి తగలదు.