ఆడపిల్లల భవిష్యత్తుకు మేలు చేసే అద్భుతమైన పథకాలివే.. ఇన్ని లాభాలున్నాయా?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ 5 పథకాలు బాలికల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి, బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారు సమాజంలో సమాన భాగస్వామ్యం పొందడానికి ఉపయోగపడతాయి. 2015లో హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో పథకం మొదలైంది.

ఆడపిల్లలకు ఈ స్కీమ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా బాలిక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం బ్యాంకు ఖాతాను తెరవడం జరుగుతుంది. ఆడపిల్లల పెళ్లికి, ఉన్నత చదువుల కోసం మంచి ఫండ్ సేకరించాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పథకం 1997లో మొదలు కాగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం కావడం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందే అవకాశాలు ఉంటాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ వర్గాల బాలికలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి.

బాలికల సమృద్ధి యోజన 2004లో మొదలు కాగా ఆడపిల్లలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పవచ్చు. చదువుకునే సమయంలో తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా బాలికలకు ప్రోత్సాహకంగా నగదు అందించే అవకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉచిత సైకిల్ పథకంను పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా వేర్వేరు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది.