దిష్టి తీసిన వాటిని తొక్కారా.. ఈ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవా?

మనలో చాలామంది పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నా మానసిక ప్రశాంతత మాత్రం లేదని చెబుతూ ఉంటారు. దిష్టి తగిలితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దిష్టి తీస్తారు. అయితే దిష్టి తీసిన వస్తువులను తొక్కినా, దాటినా ప్రమాదమని చాలామంది నమ్ముతారు. దిష్టి తీసిన వాటిని తొక్కితే నెగిటివ్ గా జరుగుతుందని ఎక్కువమంది భావిస్తారు. అయితే పండితులు మాత్రం వాటిని తొక్కినా ఏమీ కాదని చెబుతున్నారు.

నిమ్మకాయ, గుమ్మడికాయ,అ కొబ్బరికాయ చెడును ఆకర్షిస్తాయని అందువల్ల వీటిని దిష్టి తీయడానికి వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు. వీటిని దాటడం వల్ల ఆ చెడు మనకు జరుగుతుందని భావించడం మాత్రం అపోహ అని అలా జరిగే ఛాన్స్ అయితే నూటికి నూటికి నూరు శాతం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దిష్టి తీసిన వస్తువులను తొక్కినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు.

అనవసరంగా భయాందోళనకు గురైతే ఎలాంటి చెడు జరగకపోయినా చెడు జరుగుతుందనే భావన మనల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులను ఎవ్వరూ ఎక్కువగా తిరగని ప్రదేశాలలో పడేస్తే మంచిదని చెప్పవచ్చు. నడిచే దారిలో దిష్టి తీసినవి పడేస్తే మంచిదని భావించడం కూడా అపోహేనని పండితులు సూచనలు చేస్తుండటం గమనార్హం.

కొంతమంది దూదితో దిష్టి తీస్తే మరి కొందరు ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తారు. దిష్టి విషయంలో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పండితులను సంప్రదించడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే దిష్టి తీసిన వస్తువులను వీలైతే తాకకుండా ఉంటే మంచిదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.