ఏకలవ్య మోడల్ స్కూల్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. 38,000 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 23 కేటగిరీలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్ ప్లంబర్, ల్యాబ్ అటెండర్, గార్డినర్, కుక్, మెస్ హెల్పర్, చౌకిధర్, స్వీపర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా 30,000 రూపాయల నుంచి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది.
బోధనా సిబ్బందితో పటు బోధనేతర సిబ్బంది ఉద్యోగ ఖాళీలను సైతం భారీ సంఖ్యలో భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం అంటే నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
భారీ వేతనం ఆఫర్ చేస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హతలు కలిగి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే సులువుగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.