Home Life Style నైట్ షిఫ్ట్ వర్క్ తో క్యాన్సర్ ముప్పు..!! పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

నైట్ షిఫ్ట్ వర్క్ తో క్యాన్సర్ ముప్పు..!! పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

నేటి జీవిన విధానంలో మనిషి పని చేసే సమయాలు కూడా మారిపోయాయి. రాత్రిపూట మాత్రమే చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. పగలంతా అలసిన శరీరం రాత్రి విశ్రాంతిని కోరుకుటుంది. అది.. నిద్ర రూపంలో దక్కుతుంది. ఉదయం నిద్ర పోయినా.. రాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి. శరీరంలోని జన్యువులు దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారి తీస్తాయని అంటున్నారు. డీఎన్ఏ కూడా ఈ ముప్పును ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయని చెప్తున్నారు.

1 | Telugu Rajyam

కొందరు ఆరోగ్యవంతులైన వాలంటీర్లలో పగలు, రాత్రిళ్లు పని చేసేవారిపై ఈ పరిశోధనలు చేసినట్టు తెలిపారు. నైట్ షిఫ్ట్స్ లో పని చేసేవారిలో క్యాన్సర్ ఎక్కువగా ఉందని ఆధారాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సైతం దీని గురించి చెప్తోంది. మెదడులో ప్రత్యేకంగా క్లాక్ జీన్స్ ఉన్నా కేంద్ర శరీరంలోని దాదాపు ప్రతి కణానికి కూడా అంతర్భాగంలో క్లాక్ జీన్స్ అనే జన్యువులు ఉంటాయి. ఇవి లయబద్ధంగా ఉండటంతో వాటి పనితీరు పగలు, రాత్రివేళల్లో మారుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ సంబంధ జన్యువుల కదలికలు ఉంటాయని అంటున్నారు. దీనివల్లే రాత్రిళ్లు పని చేసే సమయంలో జన్యువులు కదలికలకు భంగం కలిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. దీనిని నిర్ధారించేందుకే షిఫ్ట్ వర్క్ పై ప్రయోగాలు చేశారు. ఇందులో 14 మంది పాల్గొన్నారు.

 

వీరు డబ్ల్యూహెల్త్ సైన్సెస్ స్పోకనేలోని స్లీప్ ల్యాబొరేటరీలో ఏడు రోజులు ఉన్నారు. సగం మంది మూడు రోజులు నైట్ షిఫ్ట్ వర్క్, మిగిలిన సగం మూడు రోజులు మార్నింగ్ షిఫ్ట్ వర్క్ లో పనిచేశారు. ఈ క్రమంలో ప్రతి మూడు గంటలకు ఓసారి రక్త నమూనాలు పరీక్షించారు. దీంట్లో పగటిపూట షిఫ్ట్ వర్క్ కంటే రాత్రి షిఫ్ట్ వర్క్ లోనే ఎక్కువ క్యాన్సర్ సంబంధిత జన్యువులు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవారిపై ప్రభావం చూపాయని.. నిద్ర సరిగా లేక డీఎన్ఏ జన్యువులు లయ తప్పాయని అంటున్నారు. ఈ ప్రయోగాల వల్ల క్యాన్సర్ కారకాలకు సంబంధించి, డీఎన్ఏ కు జరిగే నష్టాన్ని నివారించే ఔషదాలను తయారుచేయొచ్చని అంటున్నారు. ఈ వివరాలన్నీ పినీల్ రీసెర్జ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 

- Advertisement -

Related Posts

రాత్రివేళ ఆహారం ఆలస్యమా..? జంక్ ఫుడ్, స్నాక్స్ కూడానా..? అయితే ఇబ్బందులే..!!

రాత్రి ఎనిమిది గంటల్లోపే తినేయాలి. డాక్టర్లు, ఆహార నిపుణులే కాదు.. ఇంట్లో పెద్దవారు కూడా చెప్పే మాట ఇదే. తిన్న తర్వాత రెండు గంటల సమయం కూడా ఇవ్వాలి.. రాత్రిపూట జీర్ణక్రియ వేగం...

పొడవైనవారి కంటే.. పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గేందుకు ఎక్కువ కష్టపడాలా?

బరువు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు చాలా మంది. కూర్చుని పనిచేయడం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తినడం, వంశపారంపర్యంగా కూడా ఒళ్లు వస్తూంటుంది. ఆహార నియమాలు, వ్యాయామం, యోగా.. తదితర పద్ధతుల్లో బరువును...

జీర్ణక్రియ బాగుండాలంటే ఇవన్నీ తప్పనిసరి..!!

రోజువారీ జీవితంలో మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్న రోజులివి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్.. ఇలా ప్రతీ విషయంలోనూ టెన్షన్లే. ఇంతటి గజిబిజి జీవితంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆరోగ్యం కావాలి. అందుకు...

Latest News