మీ శరీరంపై కొవ్వు గడ్డలు ఉన్నాయా.. కొవ్వు గడ్డలకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో చాలామంది వయస్సుతో సంబంధం లేకుండా కొవ్వుగడ్డల సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చర్మం, కండరాల పొరకు మధ్య ఏర్పడే ఈ కొవ్వు గడ్డల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ గడ్డలు శరీరంపై రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఎక్కువగా ఆయిల్ ఉండే ఆహారం తీసుకునే వాళ్లకు ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

కొంతమందికి వంశపారపర్యంగా కూడా కొవ్వుగడ్డలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమంది శరీరంపై చిన్న గడ్డలు ఉన్నా ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలు ఏమోనని భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల శరీరానికి ఎలాంటి హాని కలిగే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. ఈ కొవ్వు గడ్డలు వేలితో నొక్కితే కదులుతుంటాయి. కొన్నిసార్లు వీటిని పట్టుకుంటే జారిపోవడం జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో వీటికి చికిత్స అవసరం కాగా మరికొన్ని సందర్భాల్లో ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే ఈ కొవ్వుగడ్డలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ గడ్డల సైజ్ అంతకంతకూ పెరుగుతుంటే మాత్రం చికిత్స చేయించుకోవడం ద్వారా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిన్నపాటి కోతతో వీటిని తొలగించే ఛాన్స్ ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

నాడీ కణజాలంపై ఏర్పడే గడ్డలు లైపోమా మాదిరిగా సుకుమారంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చర్మ నిపుణులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సమస్య మరీ తీవ్రమైతే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.