పెళ్లి ఖర్చులకోసం చింతిస్తున్నారా.. అయితే ఈ అద్భుతమైన స్కీమ్ మీ కోసం..?

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం అనేది చాలా ముఖ్యమైన బాధ్యత. గతంలో ఏదో నామమాత్రంగా పెళ్లిళ్లు జరిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో యువతీ యువకులు అంగరంగ వైభవంగా తమ పెళ్లి వేడుకను జరుపుకోవాలని ఆశిస్తున్నారు. అందువల్ల పెళ్లి వేడుకకు అయ్యే ఖర్చులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు కోరుకున్నట్లుగా పెళ్లిళ్లు ఘనంగా చేయలేకపోతున్నారు. అయితే ఇకపై ఇలా పెళ్లి ఖర్చులకోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మార్కెట్లో ఓ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

ఈ స్కీమ్ ద్వారా పెళ్లి ఘనంగా జరిపించడానికి అవసరమైన ఖర్చు వారే పెట్టుకొంటారు. ఆ తర్వాత మీరు దానిని ఈఎంఐల పద్ధతిలో చెల్లించవచ్చు. ఇంతకీ ఎక్కడా ఆ స్కీమ్? ఎవరు నిర్వహిస్తారు? ఎక్కడ నిర్వహిస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ట్రావెల్ ఫిన్ టెక్ సంస్థ సంకాష్, రాడిసన్ హోటళ్ల భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్ స్కీమ్ ని ప్రారంభించింది. ప్రస్తుత కాలంలో మనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి ఆ తర్వాతే ఈ అమ్మాయిల రూపంలో డబ్బు చెల్లిస్తున్నాము. అలాగే ఇక ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా అలాగే జరుగుతోంది. ‘మ్యారీ నౌ, పే లేటర్ ‘ (ఎంఎన్పీఎల్) పేరుతో దీనిని మార్కెట్ లో కి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్ సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో అందుబాటులో ఉంది. అలాగే దశల వారీగా దేశ వ్యాప్తంగా కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ ఆకాష్ దహియా చెప్పారు.

ఆఫర్‌ వివరాలు :

• మ్యారీ నౌ పే లేటర్‌ స్కీమ్ లో ఆఫర్‌ కింద గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు లోన్‌ పొందవచ్చు.
• అయితే తీసుకున్న ఈ లోన్ మొత్తాన్ని 6, 12 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
• నిర్ణయించిన 6 నెలల గడువులోగా లోన్ చెల్లిస్తే వడ్డీ వడ్డీ ఉండదు. ఒకవేళ 12 నెలలకు చెల్లిస్తే 1 శాతం వడ్డీతో సంకాష్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు ఈఎంఐ చెల్లించాలి.
• కస్టమర్ల ఐడీ, అడ్రెస్‌ ప్రూఫ్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, పేస్లిప్స్‌, ఐటీఆర్‌ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత మీకు ఎంత లోన్‌ ఇవ్వాలి అన్నది అంచనా వేస్తారు.
• ఇలాఅన్ని డాక్యుమెంట్స్‌ సరిగా ఉంటే లోన్‌ మంజూరు చేస్తారు.