నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఏపీలో 1358 టీచర్ ఉద్యోగాలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఈ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల ఖాళీల భర్తీ జరగనుండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 92 ఉండగా పీజీటీ ఉద్యోగ ఖాళీలు 846, సీ.ఆర్.టీ ఉద్యోగ ఖాళీలు 374, పీఈటీ ఉద్యోగ ఖాళీలు 46 ఉన్నాయి. డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

 

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ, బీజీ, మాజీ సైనికోద్యోగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది.

 

http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.