దీపావళి స్పెషల్..ఈ ఐదు వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే?

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు దీపావళి ఒకటి మరి కొద్ది రోజులలో దీపావళి పండుగ రానుంది. అయితే ఈ దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళి పండుగ ధంతేరస్‌తో ప్రారంభమై భయ్యా దూజ్‌తో ముగుస్తుంది. ఈ ఐదు రోజులపాటు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలలో పాల్గొంటూ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైనే ఉంటుందని భావిస్తారు అయితే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండాలంటే ఈ ఐదు రోజుల పాటు ఈ ఐదు వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మన పైనే ఉంటుంది.

ధంతేరస్‌ ప్రారంభమైన రోజున మన ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా స్వస్తిక్ చిహ్నం వేయాలి. స్వస్తిక్ చిహ్నం విజయానికి సంకేతం. ఈ చిహ్నం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఇక ఏదైనా పండుగలు వస్తున్నాయంటే ఇంటిప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టడం శుభంగా పరిగణిస్తారు కనుక ఈ ఐదు రోజులు ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు ఉండడం ఎంతో మంచిది. అదేవిధంగా ఈ ఐదు రోజులపాటు ఇంటి ప్రధాన ద్వారం ముందు లక్ష్మీదేవి పాదాలను ఉంచడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారని భావిస్తారు.

ఇలా లక్ష్మీదేవి పాదాలు మనకు మార్కెట్లో లభ్యమవుతాయి అయితే వీటిని మన ప్రధాన ద్వారం నుంచి ఇంటి లోపలికి వెళ్తున్నట్టు పెట్టాలి. ధంతేరస్‌ ప్రారంభమైన నాటి నుంచి ఆవు నెయ్యితో ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా దీపం వెలిగించాలి.అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ లేదా తులసి మొక్కను నాటడం ఎంతో మంచిది ఇలా ఐదు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ వస్తువులను ఉంచి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.