మనలో ప్రోటీన్స్ లోపాన్ని సవరించే సూపర్ ఫుడ్…. ఈ ఆహారంతో ప్రోటీన్ లోపానికి చెక్ పెట్టవచ్చు!

పోషకాహార లోపంతో బాధపడేవారు పప్పు ధాన్యాల్లో ఒకటైన శనగలను రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్,కొవ్వులు,కార్బొహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్,మాంగనీస్‌, కాపర్‌, జింక్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించి మన శరీరానికి శక్తిని, దృఢత్వాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి.గుప్పెడు సెనగల్లో మాంసాహారంతో సమానంగా ప్రోటీన్స్, క్యాలరీలు లభ్యమవుతాయి. కావున శాఖాహారులు తప్పనిసరిగా వారంలో మూడు లేదా నాలుగు సార్లు శనగలను ఆహారంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు ఉడకబెట్టిన శనగలను లేదా మొలక కట్టిన శనగలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే మనలో పోషకాహార లోపాన్ని సవరించుకోవడంతోపాటు అతి బరువు సమస్యను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. సెనగల్లో సమృద్ధిగా క్యాల్షియం, ఫాస్పరస్ లభిస్తాయి కావున ఎముక, కండరాల దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ప్రమాదకర జబ్బులనుంచి రక్షణ పొందవచ్చు. శనగల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ లోపాలను సవరించి మలబద్ధక సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. సెనగల్లో అత్యధికంగాల అభ్యుమయ్యే ప్రోటీన్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజుకు గుప్పెడు శనగ గింజలను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభిమయ్యే ఐరన్, జింక్, విటమిన్ బి12 హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి మనలో రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఉడకబెట్టిన సెనగల్లో దెండరీ ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ప్రతిరోజు గుప్పెడు మొలకగట్టిన సెనగ గింజలు తింటే ఇందులో ఉండే విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం మెదడు కండరాలను నాడీ కణ వ్యవస్థను బలోపేతం చేసి మెదడు చురుకుదనాన్ని ,జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.