గోధుమ ధాన్యం ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గోధుమ గడ్డి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ గడ్డిలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభించడంతోపాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, క్లోరోఫిల్, యాంటీ మైక్రోబియన్, యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి కావున ప్రతిరోజు ఉదయాన్నే గోధుమ గడ్డి జ్యూస్ ను సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ రోజుల్లో అత్యధిక మంది ఎదుర్కొంటున్న అతి బరువు, ఉబకాయ సమస్యలకు గోధుమ గడ్డి జ్యూస్ తో సులువుగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే గోధుమ గడ్డి జ్యూస్ సేవిస్తే మెటబాలిజం రేటు వేగవంతమై క్యాలరీలు మరియు చెడు కొలెస్ట్రాల్ తొందరగా తరిగిపోతాయి తద్వారా సహజ పద్ధతిలో శరీర బరువును తగ్గించుకోవచ్చు.
ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్లోరోఫిల్ గుణాల కారణంగా శరీరంలో వ్యర్ధాలు అన్ని తొలగిపోయి శరీరాన్ని ఎల్లప్పుడూ డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. మరియు గోధుమ గడ్డి లో ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు అన్ని రకాల క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో తోడ్పడతాయి
ఎర్ర రక్త కణాల్లో ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తే ఇందులో సమృద్ధిగా లభించే ఐరన్, ఫోలిక్, క్లోరోఫిల్ వంటి సహజ పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి.జీర్ణ సంబంధ వ్యాధులైన అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. గోధుమ గడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ రుమటాయిడ్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కండరాల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కల్పిస్తాయి.