ప్రతిరోజు ఉదయాన్నే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారా….ఈ పానీయాన్ని సేవిస్తే సమస్య దూరమైనట్లే!

ప్రతిరోజు ఉదయాన్నే మన ఆరోగ్యానికి హాని కలిగించే కెఫిన్ ఆల్కలాయిడ్ అధికంగా ఉండే కాఫీ, టీ, బ్లాక్ కాఫీ వంటి పానీయాలను సేవించడానికి బదులు సహజ ఔషధ గుణాలు పుష్కలంగా లభించే

లెమన్ టీ ని ప్రతిరోజు సేవిస్తే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు రుచికరమైన వేడి వేడి లెమన్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మొదట గోరువెచ్చని నీళ్లలో నిమ్మ రసాన్ని పిండుకొని అందులో రుచి కోస తేనెను వేసుకుంటే మరిన్ని ఔషధ గుణాలు లభిస్తాయి. రుచి సువాసన కోసం ఔషధ గుణాలు కలిగిన పుదీనా, తులసి ఆకులను కూడా లెమన్ టీ లో వేసుకోవచ్చు.

 

లెమన్ టీ ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉండే నిమ్మ పండు రసాన్ని ఉదయాన్నే సేవిస్తే మనలో ఇమ్యూనిటీ శక్తి దృఢపడి సీజనల్గా వచ్చే అనేక వ్యాధులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నిమ్మ పండు, తేనెలో ఉండే సహజ అమైనో ఆమ్లాల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడి ఉబకాయం, హై బీపీ, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

తరచూ మలబద్ధక సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా లెమన్ టీ ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధక సమస్య దూరం అవుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.ఆందోళన, చికాకు, ఒత్తిడి వంటి మానసిక శారీరక సమస్యలను అదుపు చేయడంలో లెమన్ టీ దివ్య ఔషధంలా పనిచేస్తుంది లెమన్ టీ లో పుష్కలంగా లభించే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

లెమన్ టీ లో ఉండే యాంటీబయోటిన్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను నియంత్రించి ఉదర క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తాయి. మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.