థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఆకుతో సమస్యను తరిమి కొట్టండి!

సాధారణంగా ప్రతి ఒక్కరి గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంధి ఉండడం ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి శరీర ప్రక్రియలలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ
చిన్న శక్తివంతమైన థైరాయిడ్ గ్రంధి పిట్యూటరీ గ్రంధితో కలిసి పని చేస్తుంది, ఇది మీ పుర్రె దిగువన మీ మెదడు క్రింద కనిపిస్తుంది. మీ శరీరం సరిగ్గా పనిచేసినప్పుడు, ఈ హార్మోన్లు అన్నీ సమతుల్యంగా ఉంటాయి. ఆ హార్మోన్స్ సమతుల్యత తప్పినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాలి.

ఈ విధంగా మందులు వాడుతూ ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచడానికి మునగాకు ఎంతో దోహదపడుతుంది. మునగాకులు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే.
థైరాయిడ్ పనితీరుకు సహాయపడే సెలీనియం,జింక్ అనేవి మునగ ఆకులలో సమృద్దిగా ఉంటాయి. ఈ ఆకులలో విటమిన్ A,E,C,B విటమిన్స్ సమృద్దిగా ఉండుట వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది.

ఇలా మునగాకును వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. కేవలం థైరాయిడ్ సమస్య మాత్రమే కాకుండా మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు కూడా అందుతాయి. మన శరీరంలో ఏర్పడే మలబద్ధకం అలసట నీరసం వంటి సమస్యలను కూడా మునగాకు తినడం ద్వారా పారద్రోలవచ్చు. అలాగే మన శరీరానికి కావలసినటువంటి విటమిన్లు ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా అందుతాయి.