ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్ తినే బదులు వీటిని తింటే అన్ని అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి తెలుసా?

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడి మన సాంప్రదాయ వంటకాలను తినడం మానేస్తున్నారు.ఫలితంగా చిన్న వయస్సులోనే మధుమేహం,గుండె జబ్బులు,ఉబకాయం, రక్తపోటు
నరాల బలహీనత,అల్జీమర్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఎముక క్షీణత వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఒంట్లోకి విష పదార్థాల ప్రభావం ఎక్కువవుతుంది. ఫలితంగా జీవక్రియలు మందగించి అవయవాల పనితీరు లోపిస్తుంది.

మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.కొన్ని చిరుధాన్యాల్లో ఉండే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొర్రలల్లో అధిక పీచు పదార్ధం,ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి.

ఆహార ధాన్యాలు కంటే రాగిలో చిరుధాన్యంలో అధికంగా కాల్షియం,ఐరన్,ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున రాగి చిరుధాన్యంతో చేసిన వంటకాలను మన రోజువారి ఆహారంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు,ఆర్థరైటిస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో గ్లూకోస్ స్థాయిలు స్థిరంగా ఉండి చక్కెర వ్యాధి రాకుండా అరికడుతుంది.

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఆరికలను,సామలు,ఉదలు వంటి చిరుధాన్యాలను
రోజువారి ఆహారంలో తీసుకుంటే అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉండి రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్త పోటు సమస్యను దూరం చేస్తుంది. వీటిలో అత్యధికంగా ఉన్న పీచు పదార్థం మలబద్ధక సమస్యలు దూరం చేస్తుంది. విటమిన్ బి12 మెగ్నీషియం నాడీ వ్యవస్థను మెరుగుపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. మరియు థైరాయిడ్ సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.