Cough: ‘దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కఫం’ తగ్గాలా..? ఇవి తీసుకుంటే సరి..!!

Cough: వేసవితో పోలిస్తే శీతాకాలం వెచ్చగా ఉంటుంది.. బాడీ డీహైడ్రేషన్, దాహం అనే సమస్యే ఉండదనుకుంటాం. కానీ.. ఆ చలికాలంలోనే దగ్గు, జలుబు, కఫం, ముక్కు దిబ్బడ, వైరస్.. ఇలా శరీరాన్ని అటాక్ చేస్తాయి. వీటితో ఇబ్బంది ఎక్కువ. ఒక్కోసారి వేడి చేసి ఎఫెక్ట్ అవుతాయి. అయితే.. ప్రస్తుత కరోనా సమయంలో ఈ సమస్యలు వస్తే ముందు భయానికి గురవుతున్నాం.. వైరస్ అటాక్ అయిందా? అనే అనుమానంతో..! ఈ టైమ్ లో వీటిని ఎదుర్కొనేందుకు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరి.. అంటున్నారు నిపుణులు.


అల్లంని సన్నగా తురిమి జ్యూస్ తియ్యాలి. దానిలో కొన్ని తులసి ఆకుల రసం వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది. చేదుగా అనిపిస్తుంది కాబట్టి.. కొద్దిగా తేనె కలుపుకుంటే ఇబ్బంది ఉండదు. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో రంగు మారే వరకూ వేపండి. వాటిని వేరే గిన్నెలో వేసి చల్లార్చాలి. వీటిని నమిలి తినేయాలి. చేదుగా ఉంటుంది కాబట్టి తర్వాత బెల్లం ముక్క తింటే సరి. వెల్లుల్లికి దగ్గు, జలుబు, కఫంతో గట్టిగా పోరాడే శక్తి ఉంటుంది.

నీటిలో మిరియాలు, జీలకర్ర, బెల్లం వేసి ఉడికించి కొన్ని రోజులు ఫిల్టర్ చేసి తాగినా జలుబు, దగ్గు, గొంతులో కఫం పోతుంది. అల్లం టీ టేస్ట్ తెలిసిందే కదా. ఇది బాడీకి మేలు చేయడంతోపాటు దగ్గును దరం చేస్తుంది. గోరువెచ్చటి నీరు తాగడం ఎంతో శ్రేయస్కరం. దగ్గు, జలుబు, కఫం రాకుండా చేస్తుంది. గొంతులో మంట తగ్గిస్తుంది. పరగడపున కూడా గోరువెచ్చని నీరు తాగాలి. కూలింగ్ వాటర్ వైపు చూడొద్దు.

డికాక్షన్ కూడా జలుబు, దగ్గును తగ్గించగలదు. గ్లాస్ వేడి నీళ్లు వేడి చేస్తున్నప్పుడే రెండు లవంగాలు, నాలుగు మిరియాలు, యాలిక, చిన్న అల్లంముక్క, కొద్దిగా బెల్లం వెయ్యాలి. చిన్న మంటపై ఉడికిస్తూ నీరు సగానికి తగ్గగానే నాలుగు తులసి ఆకులు వెయ్యండి. ఇందులో కొద్దిగా టీపొడి వేసి మరో నిమిషం ఉడికించండి. దానని ఫిల్టర్ చేసి ఆ డికాక్షన్ తాగితే గొంతులో, ముక్కులో ఉన్న వైరస్‌లన్నీ పోతాయి. రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగినా దగ్గు, జలుబు తగ్గుతాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.