‘విటమిన్-డి..’ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందా..?

మారిన రోజువారీ జీవన విధానంలో మనిషికి స్ట్రెస్ ఎక్కువైంది. డిప్రెషన్, బాధ, కోపం, నిరాశ, ఆందోళన, కంగారు, నిరుత్సాహం, నిర్వేదం.. ఇలా చాలా భావోద్వేగాలు వస్తున్నాయి. దీనికి వయుసుతో నిమిత్తం లేదు. వీటన్నిటి నుంచీ బయటపడాలంటే.. మన జీవిన విధానంలో మనమే మార్పు తెచ్చుకోవాలి. రోజువారీ అలవాట్లను మార్చుకోవాలి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. లేదంటే.. మొదట్లో అప్పుడప్పుడూ వచ్చే ఇటువంటి సమస్యలు దీర్ఘకాలంపాటు వచ్చి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అలసట, నీరసం, కండరాల నొప్పులు, జుట్టు రాలడం వంటివి విటమిన్-డి లోపం వల్లే వస్తూంటాయి.

మన శరీరానికి విటమిన్-డి ఎంతో అవసరం. విటమిన్-డి లోపించడం వల్ల మనలోని యాక్టివ్ నెస్ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజూ కాసేపు మన శరీరానికి ఎండ తగలాలని సూచిస్తారు వైద్యులు. ఎర్రటి ఎండ కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే ఎండలో కాసేపు శరీరానికి అందిస్తే విటమిన్-డి అందుతుంది. శారీరకంగా యాక్టివ్ నెస్ తోపాటు మానసికంగా మన ఆలోచనలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పు కూడా మంచిదని వైద్యులు అంటారు. పాలు, పాల పదార్ధాలు, పుట్ట గొడుగులు, గుడ్డు, తృణధాన్యాల్లో విటమిన్‌-డి ఎక్కువగా ఉంటుంది. నట్స్‌, ఆయిల్‌ సీడ్స్ ను కూడా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

 

విటమిన్-డి ఎముకల్లో పగుళ్లను అరికడుతుంది. ఎముకలు పొలుసు కట్టకుండా నివారిస్తుంది. చర్మం పొలుసుబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా శరీరానికి అవసరం. ఇవి అన్ని రకాల చేపలతోపాటు ‘సాల్మన్ ఫిష్’లో మరింతగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నా.. అన్ ప్రాసెస్డ్ ఆయిల్ అయితేనే రిజల్ట్ ఉంటుంది. గుడ్డు, ప్రాన్స్, క్రాబ్స్, వాల్‌నట్స్‌, ఓయిస్ట్రెస్‌, గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన రోజువారీ పనిలో చురుకుదనం, వేగం పెంచుతాయి. మానసికంగా ధృడంగానూ ఉంచుతాయి.