ఆరోగ్యం కోసం మన వంటగదిలో దొరికే సహజ పదార్థాలే గొప్ప మందులుగా పని చేస్తాయని పెద్దలు చెబుతున్నారు. అలాంటి అద్భుతమైన పదార్ధాల్లో పెరుగు–బెల్లం కాంబినేషన్ ఒకటి. చాలా మంది దీనిని సాధారణ ఆహారంగా తీసుకున్నా, నిజానికి ఇది ఆరోగ్యానికి అమూల్యమైన వరం అని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఒక గిన్నె పెరుగు, అందులో కొద్దిగా బెల్లం కలిపి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, వాంతులు, మలబద్ధకం, పిత్తం, వాతం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహజమైన చికిత్సలా పనిచేస్తుంది.
పెరుగు జీర్ణక్రియను సవ్యంగా నడిపే శక్తిని కలిగి ఉంది. ఇది కడుపులోని వేడిని తగ్గించి అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల కడుపు సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు శరీరానికి చల్లదనం అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరోవైపు, బెల్లం ఐరన్‌కి మంచి మూలం. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచుగా అలసట, తలనొప్పి, బలహీనతతో బాధపడేవారికి బెల్లం ఎంతో ఉపయోగకరం. పెరుగు–బెల్లం కలిసి తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా, శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి.
ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్టు, ఈ కాంబినేషన్‌లోని సహజ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి, seasonal flu లాంటి ఇబ్బందులను దూరం చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో పెరుగు–బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. అయితే ఒక్కో వ్యక్తికి శరీర స్వభావం వేరుగా ఉండటంతో, దీన్ని అలవాటు చేసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి అవుతుంది.
పెరుగు–బెల్లం కేవలం రుచికరమైన కలయిక మాత్రమే కాదు.. ఇది శరీరానికి పలు రకాల మేలును అందించే సహజ ఔషధం అని చెప్పొచ్చు. కనుక ప్రతిరోజూ ఈ ఆహారాన్ని ఆహార పట్టికలో చేర్చుకుంటే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చిన్న కానీ పెద్ద సహాయం చేస్తుంది.
