థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణాలు… సహజ పద్ధతిలో బయటపడే మార్గాలు!

ప్రస్తుత జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లు,పని ఒత్తిడి, కాలుష్యం వంటి అనేక కారణాలతో మన శరీర జీవక్రియలను సమన్వయపరిచే థైరాయిడ్ గ్రంధి పనితీరులో లోపాలు తలెత్తి ప్రమాదకర థైరాయిడ్ సమస్యకు కారణమవుతోంది.థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ మన శరీర జీవక్రియలను నియంత్రిస్తుంది. అలా కాకుండా
థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా థైరాక్సిన్ హార్మోను సేవిస్తే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. తక్కువగా సేవిస్తే హైపోథైరాయిడిజం అనే వ్యాధికి కారణమవుతోంది.

థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడి థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచాలంటే కొన్ని ఆహార నియమాలు ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.థైరాయిడ్ సమస్య ఉన్నవారు కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉన్న టీ,కాఫీలకు దూరంగా ఉండాలి. ఫైటోఈస్ట్రోజెన్ అధికంగా ఉన్న సోయాబీన్ ను, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్న రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పై తీవ్ర ప్రభావం పడుతుంది.

హైఫో థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజి, ముల్లంగి, కాలీప్లవర్, బ్రకోలి లాంటివి ఆహారంగా రోజువారి డైట్ లో తక్కువ తీసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ పనితీరు సక్రమంగా ఉండాలంటే జింక్, రాగి లాంటి ఖనిజాల పాత్ర కూడా కీలకమే. అందుకే జింక్ ఎక్కువగా లభించే ఓట్‌మీల్, చేపలు, నట్స్ లాంటివి ఎంచుకోవాలి.ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని అదుపులో ఉంచేందుకు వ్యాయామం, నడక ప్రాణాయామం లాంటివి సాధన చేస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.