థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని థైరాయిడ్ సమస్య వేధిస్తోంది. మన దేశంలో 40 మిలియన్ల కంటే ఎక్కువమంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారని తెలుస్తోంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య వేధించే ఛాన్స్ ఉంటుంది.

థైరాయిడ్ వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. హైపర్‌ థైరాయిడిజం వల్ల జీవక్రియల పనితీరు వేగం పెరగడంతో పాటు గుండెదడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం, విరేచనాలు కలగడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు సైతం థైరాయిడ్ లక్షణాలు అని చెప్పవచ్చు.

హైపో థైరాయిడిజంవల్ల జీవక్రియ పనితీరు మందగించడంతో పాటు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉసిరి, బ్రెజిలియన్ బీటెల్‌ నట్‌, గుమ్మడి గింజలు, పెసరలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కు చెక్ పెట్టవచ్చు.

ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎన్నో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్య వేధిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.