మనం ప్రతిరోజు ఉదయం,సాయంత్రం గ్లాసు పాలు తాగడం సర్వసాధారణం అయితే రోజూ మనం తాగే ఆవుపాలు, గేదెపాల కంటే మేక పాలల్లోనే అధిక మొత్తంలో మన శరీరానికి మరియు పిల్లల పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి,కాల్షియం, కార్బోహైడ్రేట్లు , మినరల్స్,మాంసకృత్తులు, పుష్కలంగా ఉండి మనకు శక్తి నివ్వడమే కాకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రోజుల్లో మేకపాలు దొరకడం కష్టమే అయినప్పటికీ కొన్ని కంపెనీలు మేకపాలను సేకరించి టెట్రా ప్యాకెట్లలో అమ్మడం జరుగుతుంది.
ప్రతిరోజు క్రమం తప్పకుండా మేకపాలను తాగడం వల్ల మేక పాలలో అధికంగా ఉండే సెలెనియం మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, మన శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అప్పుడప్పుడు కొబ్బరిపాలతో మేక పాలను కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మచ్చలు, మొటిమలను తొలగించడమే కాకుండా అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
ప్రతి రోజూ ఒక గ్లాసు మేక పాలు తాగడం వల్ల మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, మినరల్స్ కార్బోహైడ్రేట్లు,కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
గేదె,ఆవు పాల కంటే మేక పాలల్లో ఎముకల
పటుత్వాన్ని పెంచే క్యాల్షియం, విటమిన్ డి, సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతి రోజు మేక పాలు తాగితే వయస్సు మళ్లిన తర్వాత వచ్చే
కీళ్ల నొప్పులు,రుమటాయిడ్ ,అర్థరైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
మేక పాలలో ఉండే ఫ్యాట్ మొలిక్యూల్స్ తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి. కావున జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు మేక పాలను తాగడం మంచిది.
మేక పాలలో విటమిన్ A,E అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు తొలగి చర్మంపై కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి.రోజుల్లో మేక పాలను స్కిన్ కేర్ ఉత్పత్తిలో, బ్యూటీ సోప్, లోషన్స్ లో ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా జుట్టు, చర్మానికి మేకపాలు ఎంతో సేయస్కర్మని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మేక పాలలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు మేక పాలు తాగితే ఎర్ర రక్త కణాల అభివృద్ధి జరిగి ప్రమాదకర అనీమియా వ్యాధికి దూరంగా ఉండవచ్చు.
మేక పాలు తాగడం వల్ల కొందరిలో అలర్జీ లక్షణాలు ఉండవచ్చు అలాంటివారు డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.