ఖాళీ కడుపుతో వర్కౌట్లు చేస్తున్నారా.. ఈ తప్పులు మాత్రం మీరు అస్సలు చేయొద్దు!

పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉండవచ్చు. ఉదాహరణకు, శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే తలనొప్పి, మైకము, నీరసం మరియు కొన్నిసార్లు స్పృహతప్పిపోవడం కూడా జరుగుతుంది. పరగడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గి, వ్యాయామం చేసేటప్పుడు నీరసం మరియు బలహీనత అనిపించవచ్చు. కొన్నిసార్లు పరగడుపున వ్యాయామం చేయడం వల్ల వికారం మరియు వాంతులు కూడా రావచ్చు.

పరగడుపున వ్యాయామం చేసినప్పుడు, శరీరంలో కాల్షియం మరియు ఇతర ఖనిజాలు తక్కువగా ఉంటే, ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. వ్యాయామం చేసే ముందు ఒక చిన్న లంచ్‌ని తీసుకోండి, ఉదాహరణకు, పండ్లు, పెరుగు, లేదా ఓట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వ్యాయామం చేసే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది.

వ్యాయామం చేసే ముందు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. అదే సమయంలో ఆహారం తిన్న తర్వాత వర్కౌట్లు అస్సలు చేయకూడదు. మీరు ఆహారం తీసుకున్న వెంటనే జిమ్‌కి వెళితే, అలాంటి వ్యాయామం మీకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. వ్యాయామం చేయడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.

స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. దీనిని రెగ్యులర్‌గా చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరగడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. వ్యాయామానికి ముందు 1 నుండి 4 గంటల వరకు మరియు వర్కౌట్ తర్వాత దాదాపు 60 నిమిషాలలోపు మీ శరీరంలో ప్రోటీన్ మరియు పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయని చెప్పవచ్చు.