జుట్టు రాలే సమస్యను పెంచే అలవాట్లు చాలా ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనవి: అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, జుట్టును ఎక్కువ స్టైల్ చేయటం, ధూమపానం, మద్యం, సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం మరియు జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులు లేకపోవడం ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోతే, జుట్టు కుదుళ్ళకు సరిపడా పోషకాలు అందక జుట్టు రాలిపోతుంది.
ప్రొటీన్, ఐరన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు సరిగ్గా లేకపోతే జుట్టు రాలిపోతుంది. అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే, శరీరం సరిగ్గా పనిచేయదు, జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. జుట్టును ఎక్కువగా వేడితో స్టైల్ చేయడం లేదా కఠినమైన స్టైల్స్ చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. ధూమపానం జుట్టుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది, జుట్టుకు పోషకాలు అందకుండా చేస్తుంది.
మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది, జుట్టుకు తేమ సరిగా అందదు. సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టును తగినంతగా నూనెతో మసాజ్ చేయకపోవడం జుట్టును దెబ్బతియ్యవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు శరీరంలో చక్కెరలుగా విరిగిపోతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజన్ స్థాయిలు పెంచుతుంది. జుట్టు రాలే సమస్యను పెంచుతుంది.
విటమిన్ డి అధికంగా చేపల్ని తినడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ట్యూనా, మాకేరెల్, సాల్మన్, హిల్సా వంటి చేపల్ని తీసుకోవడం వల్ల జుట్టుకు తగిన పోషణ అందిస్తాయి. ఐరన్ లోపం ఉంటే.. ఎర్ర రక్తకణాలు మీ జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందించలేవు. ఐరన్ లోపం కారణంగా హెయిర్ సమస్య ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.