YS Jagan: అసలైన ప్లాన్ తో సిద్దమవుతున్న జగన్.. క్లిక్కయ్యేనా?

YS Jagan: 2019 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అగ్రస్థానంలో నిలిచినా, గత ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసింది. 156 మంది ఎమ్మెల్యేల బలంతో కొనసాగిన వైసీపీ, ఇప్పుడు కేవలం 11 మందితో పరిమితం కావడం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిస్థితుల్లో, పార్టీ పునరుద్ధరణకు మరియు తప్పులను సరిదిద్దేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కీలకమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నారు.

2019లో ప్రజల మద్దతుతో అధికారం చేజిక్కించుకున్న జగన్ (YS Jagan), ఇప్పుడు మళ్లీ తన మూలాలను బలపర్చడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత, రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టే షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు గడిపి, స్థానిక సమస్యలు తెలుసుకొని, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్ సంకల్పించారు. 26 జిల్లాల్లోనూ ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.

YS Jagan: కుటుంబం అంతా జగన్‌.. మాయ !

జనవరి మూడో వారం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనల్లో, సామాన్య కార్యకర్తల సూచనలు మరియు సలహాలు స్వీకరించడం జగన్ (YS Jagan) ప్రధాన లక్ష్యంగా ఉంచుకున్నారు. నియోజకవర్గాల్లో సమీక్షలతో పాటు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించనున్నారు. ఈ విధానం పార్టీని పునరుద్ధరించడమే కాకుండా, ప్రజల మధ్య జగన్ ప్రాచుర్యం మరింత పెంచేందుకు దోహదపడుతుంది.

ఇక పర్యటనలతో పాటు, తాడేపల్లిలో ప్రజల కోసం ప్రత్యేక ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలైనా, తనను నేరుగా కలిసేలా అపాయింట్‌మెంట్ లేకుండా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ప్రజలకు చేరువవ్వడానికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) తన హయాంలో ప్రజలతో నిరంతరం మమేకమై ఉండటం ఎంత పెద్ద మైలురాయిగా నిలిచిందో, అదే మార్గంలో జగన్ (YS Jagan) కూడా ఈ చర్యలు చేపడుతున్నారు. మరి ఆయన ప్రణాళికలు ఏ స్థాయిలో క్లిక్కవుతాయో చూడాలి.

Ap Public Exposed: Chandrababu & Pawan Kalyan Govt || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam